1 July, 2026 | 10:49 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అమ్మవారి కథకు శ్రీకారం

10-06-2025 12:00 AM

హెచ్‌బీజే క్రియేషన్స్, మదర్‌అండ్‌ఫాదర్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చండీ దుర్గమా’. జయశ్రీ వెల్ది నిర్మాతగా, ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నూతన నటీనటులను పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రానికి మైనుఖాన్ ఎండీ దర్శకుడు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ నటుడు అలీ ముఖ్యఅతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.

నటుడు చిట్టి కెమెరా స్విఛ్ ఆన్ చేయగా, రఘు కారుమంచి తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. “ఇటీవల అమ్మవారి నేపథ్యంగా సినిమాలు రూపొందడంలేదు.

లీ చెప్పిన ఒక పాయింట్ ఆధారంగా ఈ కథను రాశాను.” అన్నారు. ‘అమ్మవారి నేపథ్యంగా వచ్చిన సినిమాల ను ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. మంచి కథతో అమ్మవారి నేపథ్యం సినిమాను నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా’ అని నిర్మాత జయశ్రీ తెలిపారు.