15 August, 2026 | 4:58 PM

ప్రతి సోమవారం ప్రజావాణి

15-08-2026 04:18 PM

-ఎంపీడీవో జమలారెడ్డి 

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల ప్రజల సమస్యలను స్థానికంగానే త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బూర్గంపాడు ఎంపీడీవో(Burgampadu MPDO) కె. జమలారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్‌ నం.4 మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ నెల 17న సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండల పరిషత్‌ కార్యాలయంలో తొలిసారిగా ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతి సోమవారం ఇదే సమయానికి కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు.

వినతుల స్వీకరణ

ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, దరఖాస్తులను ప్రజావాణిలో నేరుగా సమర్పించవచ్చని ఎంపీడీవో తెలిపారు. మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు కార్యక్రమానికి హాజరై వినతులను స్వీకరిస్తారని పేర్కొన్నారు. అందిన ఫిర్యాదులను పరిశీలించి నిబంధనల మేరకు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు.మండల పరిధిలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్దేశిత సమయంలో తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను సమర్పించాలని ఎంపీడీవో కె. జమలారెడ్డి కోరారు.