15 August, 2026 | 4:57 PM

నూతన కాంగ్రెస్ మండల అధ్యక్షుడికి ఘన సన్మానం

15-08-2026 04:19 PM

గణపురం, ఆగస్టు15 (విజయక్రాంతి): మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి భాస్కరరావు ను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, కాంగ్రెస్ మండల, జిల్లా నాయకులు తాళ్లపల్లి భాస్కరరావును పూలమాలలు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన భాస్కరరావు ఆధ్వర్యంలో మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మాజీ సర్పంచ్ నారాగాని దేవేందర్ గౌడ్, బోనాల రాజమౌళి, మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ గౌడ్, దూలం కుమారస్వామి గౌడ్, బత్తిని శివశంకర్ గౌడ్, గుర్రం తిరుపతి గౌడ్, గుజ్జ గంగాధర్ రావు, దూడపాక దుర్గయ్య, దూడపాక శ్రీనివాస్, బండి తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.