10 March, 2026 | 1:13 AM

ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి

09-03-2026 09:08 PM

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలి

నిరుపయోగ వస్తువులు, చెత్తాచెదారం తొలగించాలి

పెండింగ్ ఫైళ్లు పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజాపాలన -ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యక్రమాల అమలుపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఆయా శాఖల అధికారులతో సోమవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ప్రతి జిల్లా కార్యాలయం, సిరిసిల్ల, వేములవాడ, ఆయా ప్రాంతాల్లోని జిల్లా కార్యాలయాలు, మున్సిపల్, తహసీల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో స్వచ్చత.. పరిశుభ్రత పనులు పక్కాగా చేయాలని, ఆయా శాఖల అధికారులు, మండల అధికారులు పెండింగ్ ఫైళ్లు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో నిరుపయోగ వస్తువులు, చెత్తాచెదారం ఉండకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయి తదితరులు పాల్గొన్నారు.