21 April, 2026 | 9:19 PM

టిఆర్పి బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి

21-04-2026 07:55 PM

టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజని కుమార్ యాదవ్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ హనుమకొండ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్పి వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, గ్రామస్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడిని అరికట్టేందుకు, ఈనెల 26న ఇందిరా పార్కు వద్ద నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని, హనుమకొండ జిల్లా నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని కోరారు. అంతేకాకుండా కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా పార్టీ అండగా ఉంటుందని, పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అలాగే జిల్లా, మండల, గ్రామ కమిటీల నిర్మాణం, ప్రజా సమస్యలపై పోరాటం, విద్యారంగంలో జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువ కప్పి స్వాగతం పలికినారు.