21 April, 2026 | 9:19 PM

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు, వీల్ చైర్లు పంపిణీ

21-04-2026 07:59 PM

జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుమోహన్

కామారెడ్డి,(విజయక్రాంతి): రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు, వీల్ చైర్ లో పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్ అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్, వీల్ చైర్స్, సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి సహకారంతో పిఎఫ్ఐ, గర్గుల్ స్వచ్ఛంద సంస్థ వారు గర్గుల్ సెంటర్లో మంగళవారం మహిళలకు కుట్టుమిషన్, దివ్యాంగులకు వీల్ చైర్స్ విద్యార్థినులకు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రోటరీ క్లబ్ వారు సామాజిక కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుంటారని పీపుల్ ఫర్ ఇండియా లాంటి స్వచ్ఛంద సంస్థ సహకారంతో కుట్టుమిషన్లు, వీల్ చైర్స్, బెడ్స్, కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. దీనివలన మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు, వికలాంగులకు కొంత ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. కావున ప్రజలందరూ సామాజిక బాధ్యతలో భాగంగా అందరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా వికలాంగుల యొక్క తల్లిదండ్రులు తమకు ఊరట లభించిందని  అని పేర్కొన్నారు.