1 September, 2026 | 1:54 AM

ప్రతి యువకుడి కథ

01-09-2026 01:10 AM

యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా ఓ సినిమా రూపొందు తోంది. సన్నీ సంజయ్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sitara Entertainments) నిర్మి స్తోంది. హారికా సూర్యదేవర నిర్మాత. ఎస్ నాగవంశీ సమర్పకుడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్ర ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మేకర్స్ సోమవారం ఓ చిన్న గ్లింప్స్‌ను విడుదల చేశారు. నేటి యువత జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలు, కలలు, ఆశలు, ఆకాంక్షలు, సవాళ్లను ప్రతిబింబించే కథతో రూపు దిద్దుకోనుందని టీమ్ వెల్లడించింది.