1 September, 2026 | 2:33 AM

రేవంత్ వైఫల్యాల డైవర్షన్

01-09-2026 01:50 AM

నీ మాటలకు వెయ్యిరోజుల పాలనే నిదర్శనం

మైకు దొరికిన ప్రతిసారీ కేసీఆర్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నవ్

కేసీఆర్‌పై మాటలను ఉపసంహరించుకోవాలి

బేషరతుగా క్షమాపణ చెప్పాలి

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): ‘రేవంత్‌రెడ్డీ.. ముఖ్యమంత్రిగా ప్రజల కష్టాలను పట్టించుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. కానీ నీ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిసారీ కేసీఆర్‌పై నిందలు మోప డం, దుర్భాష లాడడం నీ ఏకైక అజెండాగా మార్చుకున్నావు.

ఈ డైవర్షన్ రాజకీయాలను తెలంగాణ సమాజం నిశితంగా గమని స్తోంది’ అని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. ‘అవును.. నువ్వు మాట్లాడిన ‘నంది ఎవరో.. పంది ఎవరో’ అన్న మాటలకు సమాధానం నీ 1000 రోజుల పాలనే తేటతెల్లం చేస్తోంది’ అని మండిపడ్డారు. కేసీఆర్‌పై అక్కసు వెళ్లగక్కడం, వ్యక్తిగత దూషణలకు దిగడం ద్వారా ‘నీ స్థాయి ఏమాత్రం పెరగదు’ అన్నారు.

పైగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుంటే తమరి రాజకీయ సంస్కారం, ఆలోచనా దౌర్భాగ్యం ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమవుతున్నాయని తెలిపారు. ఈ మేరకు సోమ వారం మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరి గురించి మాట్లా డుతున్నావో ఒక్కసారి ఆలోచించు రేవంత్. తెలంగాణ అస్తిత్వం కోసం ప్రాణాలను ప ణంగా పెట్టి, ఉద్యమాన్ని ఉధృతం చేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఉద్యమ రథసారథి కేసీఆర్ అని స్పష్టం చేశారు.

స్వరాష్ట్రంలో పదేళ్లపాటు సాగునీరు, నిరంతర విద్యుత్, రైతుబంధు, సంక్షేమం, సమగ్ర మౌలిక వసతులతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన దార్శనికుడు కేసీఆర్ అని అన్నారు. అలాంటి నాయకుడిపై నోరుపారేసుకోవడం చాలా సులభమే కావచ్చు, కానీ ఆయనలా తెలంగాణ కోసం నిబద్ధతతో పనిచేయడం, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపడం 1000 జన్మలెత్తినా నీవల్ల కాదని ఎద్దేవా చేశారు.

‘సూర్యుడిపై ఉమ్మివేస్తే అది తిరిగి నీ ముఖం పైనే పడుతుంది తప్ప సూర్యుడి తేజస్సు తగ్గదు. నువ్వు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఎన్ని విమర్శలు గుప్పించినా ఎన్ని బూతులు మాట్లాడినా, ఎన్ని తిట్లు తిట్టి నా తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ పేరును, ప్రజల గుండెల్లోం చి ఆయన ముద్రను చెరిపివేయడం ఎవరి తరమూ కాదన్నారు. ఇం తకీ కాంగ్రెస్ పాలనలో ఏం సాధించావో ప్ర జలకు సమాధానం చెప్పాలన్నారు. 

ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక, ప్రతిరోజూ కేసీఆర్‌ని దూషిస్తే తమరి పాలనా వైఫల్యాలు మరుగున పడిపోవన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎవరు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారో, ఎవరు నమ్మించి నయవంచన చేశారో ప్రజలకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఇప్పటికైనా స్థాయిలేని చిల్లర మాటలు, డైవర్షన్ రాజకీయాలు బంద్ చేయాలని, ‘కేసీఆ ర్‌పై నీ మాటలను వెంటనే ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్ చేస్తున్నాం.