నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి, ఓటర్ల సవరణపై ప్రత్యేక దృష్టి
కౌన్సిల్ సమావేశం
09, 10 వార్డుల్లో ఓటర్ల హియరింగ్ నిర్వహణ
నర్సాపూర్: నర్సాపూర్ పురపాలక సంఘంలో పట్టణాభివృద్ధి పనులు, ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాచునూరి లక్ష్మి రాజు యాదవ్ అధ్యక్షతన, కమిషనర్ చెరుకు సాయికుమార్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడమే కాకుండా విద్యుత్ సమస్యలతో పాటు పట్టణ పరిధిలోని పలు ఇతర ప్రజా సమస్యలపై చర్చించారు.
ఓటర్ల జాబితా సవరణకు దరఖాస్తుల స్వీకరణ:
ఎస్.ఐ.ఆర్ (సార్ ) ప్రక్రియలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 09, 10 వార్డులలో ఏ ఈ ఆర్ వో మరియు కమిషనర్ సాయికుమార్ ఆధ్వర్యంలో ఓటర్ల హియరింగ్ నిర్వహించారు. ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ప్రజలందరూ మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను పరిశీలించి, తప్పులుంటే వార్డు సభల్లో దరఖాస్తులు అందజేయాలని కమిషనర్ సూచించారు.






