18-09-2025 01:54:34 AM
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
వికారాబాద్, సెప్టెంబర్- 17 (విజయక్రాంతి): ప్రజలందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంలో ఆయన పాల్గొని, జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని చెప్పారు. వికారాబాద్ జిల్లాలో రైతు రుణ మాఫీ పథకం కింద మొత్తం లక్ష 358 మంది రైతులకు 8 వందల 49 కోట్ల రూపాయలు రుణ మాఫీ చేసినట్టు తెలిపారు. చేయూత పథకం ద్వారా వికారాబాద్ జిల్లాలో మొత్తం లక్షా 9 వేల 283 మంది లబ్దిదారులకు ప్రతి నెలా 27 కోట్లు ఆసరా పెన్షన్లు చెల్లించబడుతోందని ఆయన అన్నారు.