18-09-2025 01:56:10 AM
రంగారెడ్డి, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): అమరుల త్యాగాల ఫలితమే నాటి హైదరాబాద్ రాష్ట్రం నేటి తెలంగాణగా ఆవిర్భవించి ందని నీటిపారుదల శాఖ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట అమరుల త్యాగ ఫలితంగా విలీనం జరిగిన రోజు సెప్టెంబర్ 17 అని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొని, జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతర పోరాటం ద్వారానే ప్రజల ఆకాంక్ష నెరవేరిందని చెప్పారు. అమరవీరుల త్యాగాల పునాదులపై నిర్మించ బడిన తెలంగాణా రాష్ట్రంలో వారసత్వంగా వచ్చిన సంపాదనను పరిరక్షించుకోవడంతో పాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన 48 గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వాగ్ధానాలను అమలులోకి తెచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలతో రంగారెడ్డి అధికంగా ప్రయోజనం పొందుతుం దనా ్నరు.