26 June, 2026 | 1:46 AM

బీఎల్‌ఓలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

26-06-2026 12:19 AM

గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్

మేడ్చల్ అర్బన్, జూన్ 25 (విజయక్రాంతి): మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లిలో ప్రారంభమైన సర్ ప్రక్రియ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి బిఎల్‌ఓ.బి.ఎల్.ఎ లకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఓటు చాలా ముఖ్యమని బిఎల్‌ఓ లు ఇచ్చినటువంటి ఫామ్ ను పూర్తిగా చదివిన తర్వాత నింపాలని ఆయన వివరించారు.

బి.ఎల్.ఓ లు ఇచ్చిన ఫామ్ అర్థం కాకపోతే బి.ఎల్.ఏ లను సంప్రదించి ఫామ్ ను నింపాలని శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అండ్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్ గుండ్లపోచంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బండారు నరేందర్ ముదిరాజ్.బిఆర్‌ఎస్ పార్టీ మాజి మున్సిపల్ కౌన్సిలర్ బేరి బాలరాజు.శివరాజ్.బైండ్ల ప్రవీణ్ బి.ఎల్.ఓ శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.