26 June, 2026 | 1:47 AM

జూలై 5 నుంచి లాసెట్ కౌన్సెలింగ్

26-06-2026 12:18 AM

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): జూలై 5వ తేదీ నుంచి లాసెట్ కౌన్సిలింగ్‌ను నిర్వహించనున్నట్టు అడ్మిషన్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది. శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తోపాటు స్టిఫికెట్ వెరిఫికేషన్‌ను వచ్చే నెల 5వ తేదీ నుంచి 10 వరకు ఎల్‌ఎల్‌బీ వారికి, 27 నుంచి 31 వరకు ఎల్‌ఎల్‌ఎం అభ్యర్థులకు అవకాశం కల్పించారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు అభ్యర్థులకు వచ్చే నెల 24న,  ఆగస్టు 5న ఎల్‌ఎల్‌ఎం కోర్సు అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు.