6 April, 2026 | 4:54 PM

Breaking News

కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమతా బెనర్జీ విమర్శలు   •   కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •   ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •   ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. లిక్కర్ కేసు విచారణ వాయిదా   •  

ప్రతి ఒక్కరు ఆరోగ్య లక్షణాలు పాటించాలి

06-04-2026 03:18 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరు ఆరోగ్య వంతంగా ఉండాలంటే ఆరోగ్య లక్షణాలు పాటించాలని కలెక్టర్ హరిత పేర్కొన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయ ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగంగా వైద్య కళాశాల,నర్సింగ్ కళాశాల విద్యార్థులు చేపట్టిన-2 k రన్ ర్యాలీని అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సీతారాం, వైద్య కళాశాల ప్రిన్సిపల్ సుబోద్ కుమార్ తో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంబించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు ఆరోగ్య వంతంగా ఉండాలంటే ఆరోగ్య లక్షణాలు పాటించాలన్నారు. జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలన్నారు. ప్రతి రోజు, నడక, వ్యాయం, చేయాలన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. ఆరోగ్య చిట్కాలు పాటిస్తే మదు మేహం,రక్త పోటు, క్యాన్సర్, లాంటి వ్యాదులకు దూరంగా వుండవచ్చన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగంగా ఈ నెల 6 నుండి 11వరకు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఆరోగ్య వారం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ర్యాలి కుమ్రం భీం చౌక్ మీదుగా బస్టాండ్ వద్ద అంబేద్కర్ చౌక్ వరకు సాగింది.ఈ కార్యక్రమములో అధికారులు, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.