చట్టాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి
19-05-2026 06:02 PM
బోథ్,(విజయక్రాంతి): చట్టాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటేనే తప్పులు చేయకుండా ఉంటారని చట్టాలపై అవగాహన ఉండాలని న్యాయవాది పంద్రం శంకర్ పేర్కొన్నారు. మంగళవారం బోత్ మండలంలోని పాట్నాపూర్ మేడిగూడ ఇన్కర్పల్లి గ్రామాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాది మాట్లాడుతూ మోటార్ వాహనాలు బాల్య వివాహాలు గురించి వివరించారు. ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వివరించడం జరిగింది.






