19-02-2026 12:56:53 PM
మున్సిపాలిటీ చైర్మన్ మెంగ్రే ఆకాష్
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పరిపాలన దక్షుడు, ధర్మరక్షకుడు అయిన ఛత్రపతి శివాజీ(Chhatrapati Shivaji) చరిత్రను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ మెంగ్రే ఆకాష్ సూచించారు.గురువారం ఆసిఫాబాద్‌లోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొఘలుల అరాచకాలు, పైశాచికత్వం నుంచి ప్రజలను విముక్తి కల్పించాలనే లక్ష్యంతో హిందూ రాజ్య స్థాపన కోసం పోరాడిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ కొనియాడారు.
ప్రభుత్వం ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ జయంతికి సెలవు ప్రకటించాలి అని కోరారు. అలాగే, ఛత్రపతి శివాజీ జయంతిని అధికారికంగా ఘనంగా నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, కుర్సెంగ బాలకృష్ణ, సలాం, ఏఎంసీ డైరెక్టర్ వైరాగడే మారుతి, రాజంపేట ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి, నాయకులు దూడల అశోక్, బొట్టుపల్లి జయరాం, హిప్రే సందీప్, నాగోశే శంకర్, శెండే మురళి తదితరులు పాల్గొన్నారు.