వెలిదండలో 15 లక్షలతో సిసి రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభం
* మౌలిక వసతుల కలపనే ప్రభుత్వం లక్ష్యం
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో 15 లక్షల వివిధ అభివృద్ధి పనులను శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మంజూరైన 15 లక్షల నిధులతో గ్రామంలో చేపడుతున్న నూతన డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణ పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చెన్నగాని సాంబయ్య, మలిదశ ఉద్యమకారుల కన్వీనర్ మేకల నాగేశ్వరరావు తో కలిసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో వెలిదండ గ్రామ సమగ్ర అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని, రాబోయే రోజుల్లో గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని వారు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ యనాల సోమయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీసాల వెంకటేశ్వర్లు, చెన్నగాని రామయ్య, చెన్నగాని మట్టయ్య, మాజీ సర్పంచ్ ఆదూరి కోటయ్య, పద్మ, వార్డు మెంబర్లు గండు యల్లయ్య, ములకలపల్లి నాగరాజు, కామల్ల వెంకటి, దుగ్గి తిరపయ్య, కామల్ల లలిత, గండు కల్యాణి, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.






