26 June, 2026 | 9:55 PM

గ్రామాలలో ఓటర్లకు ఎనుమరేషన్ పత్రాల అందజేత

26-06-2026 08:39 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని అన్ని గ్రామాలలో బిఎల్ఓల ఆధ్వర్యంలో జిపిఓలు ఓటర్లకు ఎనిమరేషన్ పత్రాలను పంపిణీ చేసినట్లు మండల తాసిల్దార్ బిక్షపతి తెలిపారు. మండలంలోని ఓటర్లందరూ ఎస్ఐఆర్ ఎనిమరేషన్ పత్రాలలో వివరాలు నమోదు చేసి తమ ఓటు హక్కును సరిచూసుకొ కావాలని తెలిపారు. అర్హత కలిగిన ఓటర్లందరూ తమ ఓటు హక్కును ఓటర్ లిస్ట్ జాబితాలో నమోదు చేసుకోవాలని అన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఓటర్ లిస్ట్ ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను చేపడుతున్నారని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి పౌరుని ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదీ అని తెలిపారు. ఓటర్లందరూ విధిగా తమ ఓటును సరిచూసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఆర్ఐ అజయ్, జిపిఓలు  తదితరులు పాల్గొన్నారు