ప్రతి ఓటరు తన ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
కామారెడ్డి,(విజయక్రాంతి): ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొని నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో జుమ్మా నమాజ్ అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రతి ఓటరు తన ఓటు హక్కును కాపాడుకోవాలంటే ఎస్ఐఎన్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.
ఓటర్ జాబితా పూర్తిగా పారదర్శకంగా తప్పులు లేకున్నా రూపొందించండి ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపే దానికి ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం అన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు అని పేర్కొన్నారు. మా పేర్లు జాబితాలో సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు పరిశీలించి తప్పులుంటే సర్దించుకోవాలన్నారు. కొత్తగా అరవత పొందిన వారు తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు.






