30 June, 2026 | 11:30 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

14-06-2025 12:00 AM

యాదాద్రి భువనగిరి జూన్ 13 ( విజయ క్రాంతి ): ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా శుక్రవారం నాడు మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్ భాస్కరరావు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ  బాల కార్మిక చట్టాల గురుంచి మరియు కర్మగారాలు ఫ్యాక్టరీ . హోటల్స్. కిరాణషాపులు.ఇటుకబట్టీలు. కోళ్ల ఫారాల లో  18 సంవత్సరాల లోపు బాలలను పను లలో పెట్టుకున్నట్లయితే యాజమ నులపై   కేసులు నమోదు అవుతాయని. ఒకవేళ పిల్లలను పనిలో పెట్టుకున్నట్లయితే రెండు సంవత్సరాల జైలు శిక్ష 50 వేల రుపాయాల జరిమాన విధించడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం జిల్లా సంక్షేమ అధి కారి  నరసింహ రావు  ర్యాలీలో పాల్గొని  షాపు యజమానులు బాల కార్మికులను పనిలో పెట్టుకోకూడదని కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమం లో  డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, డి ఐ ఈ ఓ రమణీ , జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పాపిరెడ్డి , సిడీపిఓ శైలజ, ఏ ఎల్ ఓ మోయిజుద్దీన్ , జిల్లా బాలల పరిరక్షణ విభాగం ,సఖీ విభాగం డిఎల్‌ఎస్‌ఏ సిబ్బంధి,జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంధి , స్కోప్ ఎన్జిఓ , అంగన్వాడీ టీచర్లు ,విద్యాశాఖ సిబ్బంధి , విద్యార్ధులు పాల్గొన్నారు.