30 June, 2026 | 10:33 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అక్రమ మద్యం అమ్మకాలను ఆపాలి

14-06-2025 12:00 AM

బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి టౌన్ జూన్ 13: వనపర్తి జిల్లాలో భోజనం హోటళ్లలో చట్ట విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుగుతున్న కూడా కళ్ళు మూసుకొని చోద్యం చూస్తున్నారా? అని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఎక్సైజ్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ను కలిసి అక్రమ మద్యం అమ్మకాలపై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....భోజనం పేరుతో హోటళ్లు నడుపుతున్న కొందరు గుట్టు చప్పుడు కాకుండా మద్యం అమ్మకాలను అక్రమంగా నిర్వహిస్తున్నారని,కట్టడి చేసి కఠిన చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పం దించి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు గూడుషా, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షుడు ధర్మేంద్ర సాగర్, ప్రధాన కార్యదర్శి అస్కని రమేష్ తదితరులు పాల్గొన్నారు.