19 April, 2026 | 3:56 AM

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పరిశీలన

11-06-2025 05:43 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి టౌన్: ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ భద్రతపై నిరంతరం నిఘా పెట్టాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi) ఆదేశించారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ నెలవారీ తనిఖీలో భాగంగా బుధవారం వనపర్తి పట్టణం ఆర్డీవో కార్యాలయ ఆవరణంలోని ఈవీఎం భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... నూతన స్ట్రాంగ్ రూమ్ భద్రతలో ఎంతమంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు, హాజరు పట్టికను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పై సీసీ కెమెరాలతో నిరంతరం పోలీస్ నిఘా ఉంచాలన్నారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 1200 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసేలా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆర్డీవో సుబ్రహ్మణ్యం, రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) జి. వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, డిప్యూటీ తహసిల్దార్ నాగేందర్, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం రాజకీయ పార్టీల ప్రతినిధులు వేణా చారి, కుమారస్వామి, జమీల్, పరమేశ్వర చారి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.