పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి
మండల విద్యాధికారి గజ్జల కనకరాజు..
దౌల్తాబాద్: స్కావెంజర్లు ప్రతిరోజు పాఠశాలను శుభ్రం చేసి పరిశుభ్రంగా ఉంచాలని మండల విద్యాధికారి గజ్జల కనకరాజు(Mandal Education Officer Gajjala Kanakaraju) అన్నారు. బుధవారం దౌల్తాబాద్ జిల్లా పరిషత్తు ఉన్నత బాలికల పాఠశాలలో మండలంలోని ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వహకులు, శానిటైజర్ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వంట కోసం వాడే పాత్రలు పరిశుభ్రంగా ఉంచడం స్వచ్ఛమైన తాగునీటిని అందించేలా పాఠశాల ఆవరణలో చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం కావడం వేడి వంటకాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. తరగతి గదులు, శౌచాలయాలు, త్రాగునీటి ట్యాంకులు శుభ్రం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి, అఫ్జల్ హుస్సేన్, శేషయ్య, బాసిత్ తదితరులు పాల్గొన్నారు.






