బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో విద్యార్థుల ప్రతిభ
కొత్తకోట: కొత్తకోట పట్టణంలోని భారతీ విద్యా మందిర్ హైస్కూల్(Bharathi Vidya Mandir High School) ఆవరణలో గాడ్స్ ఆన్ వారియర్స్ షోతో ఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో చీఫ్ ఎగ్జామినేర్ క్లబ్ ఫౌండర్ అబ్దుల్ నబీ సారథ్యంలో బ్లాక్ బెల్ట్ రీడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ మాస్టర్ ఇంతియాజ్, విద్యార్థులు పరీక్షలు నిర్వహించారు. ఈ విద్యార్థులు వివిధ విభాగాలలో చక్కటి ప్రతిభ కనబరిచి బెల్టు సర్టిఫికెట్ సాధించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీ విద్యా మందిర్ హై స్కూల్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు బెల్టు సర్టిఫికెట్ అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... కరాటే అనేది చిన్న వయసు నుంచి నేర్చుకుంటే విద్యార్థులకు క్రమశిక్షణ మేధస్సు ఆరోగ్యంగా ఉంటారని ఆ స్కూల్లో గత 25 సంవత్సరాల నుండి శిక్షణ ఇస్తున్నారని, భవిష్యత్తులో కూడా వారి సమస్త కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులు గండు వైష్విక్ తేజ్, ఎస్ నందన్ లను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫౌండర్స్ ఎగ్జామినే జి హరీష్ యాదవ్, జాఫర్, సాదిక్, ఎస్.కె బాబా, అజ్మీర్ పాల్గొని విద్యార్థులను అభినందించారు.






