03-02-2026 12:14:03 AM
మంచిర్యాల, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ప్రభుత్వ పీజీ కళాశాలలో ఎంకాం జనరల్, ఎంఎస్సీ మాథ్స్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులు నిర్వహిస్తున్నారు. 60 నుంచి 70 మంది వరకు విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. వీరికి ఈ నెల మూడవ తేదీ నుంచి 16వ తే దీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు పరీక్షల షెడ్యూల్ ఇచ్చా రు. ఒక్క క్లాసు జరుగకుండానే యూనివర్సిటీ ఆదేశాల మేరకు విద్యార్థులకు పీజీ పరీ క్షలు నిర్వహించేందుకు కళాశాల యాజమా న్యం సిద్ధమైంది.
కళాశాలలోని ఆయా కో ర్సులకు సంబంధించి లెక్చరర్ల నియామ కం చేపట్టకపోవడంతో విద్యార్థులకు కనీసం ఏ సబ్జెక్టులో ఏ పాఠ్యాంశం ఉందో అవగాహన లేదు. ఇప్పటి వరకు ఒక్క క్లాసు జరుపలేదని, ఏయే సబ్జెక్టులు మ్యాపింగ్ చేశారో, ఆ సబ్జెక్టులలో ఏ సిలబస్ ఉందో కూడా తెలియదని, సబ్జెక్టుపై ఎలాంటి అవగాహన లేదని, ఏం రాయాలో తెలియడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఈ కళాశాలలో కేవలం డిగ్రీ బోధించే అధ్యాపకులే ఉన్నారు. పీజీ బోధించే లెక్చరర్‌లను ప్రిన్సిపాల్ నోటిఫికేషన్ ఇచ్చి నియమించుకోవాలి.
అదేం చేయకుండానే కాలేజీని కొనసాగించడం, తరగతులు బోధించే లెక్చరర్లు లేకపోవడంతో విద్యార్థులు సైతం కళాశాలకు రావ డం మానేశారు. దీంతో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు మంగళవా రం నుంచి జరిగే మూడో సెమిస్టర్‌లో ఏం రాస్తారనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. గతం లో ఇదే కాలేజీలో ఒక పరీక్షకు బదులు మరో పరీక్ష పెట్టడంతో ఒక బ్యాచ్ విద్యార్థులు ఫెయిల్ అయిన విషయాన్ని 2025, నవంబర్ 24న అధ్యాపకుల తప్పిదం బ్యాచ్ ఫెయిల్’ పేరిట ‘విజయక్రాంతి’లో కథనం ప్రచురితమైంది. యూనివర్సిటీ అధికారులు స్పందించి తిరిగి పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు.