15 March, 2026 | 8:31 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

కిట్స్ మహిళా కళాశాలలో ప్రాంగణ ఎంపికలు

03-02-2026 12:14 AM

కోదాడ, ఫిబ్రవరి 2: కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు కళాశాల  చైర్మన్ నీలా సత్యనారాయణ సోమవారం తెలిపారు. హైదరాబాద్ లోని ప్రముఖ కోర్  కంపెనీఐన సంగ్లారే ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించడం జరిగినది. సంగ్లారే  టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యూమన్ రిసోర్స్ ప్రతినిధిలు నాని బాబు,  సౌమ్య ఆధ్వర్యంలో  నిర్వహించిన  ప్రాంగణ ఎంపిక లలో  కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల  33 మంది  బీటెక్ విద్యార్థి నులు, ఏడుగురు డిప్లొమా  విద్యార్థి నులు ఎంపిక అయ్యారు.

 ఎంపిక అయిన విద్యార్థినులకు రూ 4 లక్షలు వార్షిక వేతనం  ఉంటుందని కంపెనీ మానవ వనరుల అధికారులు నాని బాబు, సౌమ్య తెలిపారు.  ప్రాంగణ ఎంపికలకు ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ, ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ,  డైరెక్టర్  డాక్టర్ నాగార్జున రావు, టీపీవో పుష్ప లత, అధ్యాపకులు అభినందించారు.