03-02-2026 12:13:05 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఫిబ్రవరి 2: ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని సర్పంచ్ నున్న యాదగిరి అన్నారు.మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో సోమవారం నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ వారు ఉచిత హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులను అందజేశారు.అనంతరం సర్పంచ్ యాదగిరి మాట్లాడుతూ కామినేని హాస్పిటల్ వారి సేవలు అభినందనీయమని,ప్రతీ ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాండ్ర గోవర్ధన్,బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తొడుసు వీరమల్లు,6వ వార్డు సభ్యుడు నున్న సురేష్ యాదవ్,ఆశా కార్యకర్త శోభ,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.