బ్యాడ్మింటన్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన
- అండర్ విభాగంలో రన్నరప్‌గా సైనా శర్మ
- రేయాంశ్ బనాలా అవ్యయ్ జంటకు బ్రాంజ్ మెడల్
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): అండర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ ఆటగాళ్లు అద్భుత ప్రతిభ కనబరచారు. గర్ల్స్ సింగిల్స్ విభాగంలో సైనా శర్మ మెరిసి రన్నరప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ప్రారం భం నుంచి దూకుడు ఆటతో చెలరేగిన సైనా, ఫైనల్ మ్యాచ్‌లో బలమైన పోరాటం చేసినప్పటికీ స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.
బాయ్స్ డబుల్స్ అండర్ 11 విభాగంలో తెలంగాణకు ప్రతిష్ట తీసుకొచ్చిన రే యాంశ్ బనాలా అవ్యయ్ భీమవరపు జంట సమర్థవంతమైన ప్రదర్శనతో బ్రాంజ్ మెడ ల్ కైవసం చేసుకుంది. కీలక సందర్భాల్లో ఇద్దరూ చూపిన సమన్వయం, చాకచక్యం అందరి ప్రశంసలు అందుకుంది.
ఈ ముగ్గు రు ఆటగాళ్ల ప్రతిభను గర్వంగా పేర్కొంటూ భాస్కర్ బాబు బ్యాట్మెంటన్ అకాడమీ చీఫ్ కోచ్‌లు భాస్కర్ బాబు, గోవర్ధన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తల్లిదండ్రులు, అభి మానులు, క్రీడా వర్గాలు సైనా శర్మ, రేయాం శ్ బనాలా, అవ్యయ్ భీమవరపు విజయాలను హర్షం వ్యక్తం చేస్తున్నారు.




