సోనియా పవార్ అత్యుత్తమ ప్రతిభ
అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ కోచ్ వర్క్ షాప్‌కు ఎంపిక
గాంధారి, డిసెంబర్ 12 (విజయక్రాంతి): వాలీబాల్ పెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆసి యా వాలీబాల్ పెడరేషన్, ఫెడరేషన్ డి ఇంటర్నేషనల్, భువనేశ్వర్‌లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశ్వవి ద్యాలయం కన్య కిరణ్ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహిళ వాలీబాల్ కోచ్‌లకు ఇస్తున్న ఈ వర్క్‌షాప్‌కు గాం ధారి మండలం పెట్ సంగంలోని ధన్‌సింగ్ తం డాకు చెందిన జరప్ల సోనియా పవార్ ఎంపి క అయింది.
ఈ నెల 11 నుంచి 14 వరకు వాలీబాల్ క్రీడలో మెళుకువలు నూతన విధానాల పట్ల అంతర్జాతీయ వాలీబాల్ పె డరేషన్ అమెరికా నుండి వచ్చిన ప్రత్యేక కో చ్‌లు యానా, జోన్ కేసెల్ వాలీబాల్ క్రీడా ఆధునిక పద్ధతులు నేర్పిస్తున్నారు. సోనియా ప్రస్తుతం పీఎంశ్రీ ప్రత్యేక కోచ్‌గా జవహర్ నవోదయలో హైదరాబాద్‌లో పని చేస్తున్నా రు. మారుమల గిరిజన తండ నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న సోనియా కి బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ చీఫ్ ప్యాట్రాన్ గుగ్లోత్ సురేందర్ అధ్యక్షురాలు సేవంత, బాధ్యులు బాల కృష్ణ, రామకృష్ణ, తదితరులు అభినందనలు తెలిపారు.




