9 April, 2026 | 5:57 AM

రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న వినేశ్ ఫొగాట్

13-12-2025 01:15 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 12 : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఒలింపిక్ కలను నెరవేర్చుకునేందుకు మళ్లీ రెజ్లింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్టు తెలిపింది. 2028 లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. 2024 పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్‌కు రజతం ఖాయమైంది.

అయితే రెండోరోజు 100 గ్రా. బరువు పెరగడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. ఈ బాధతోనే రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వినేశ్ ఎమ్మెల్యేగా కూడా గెలిచింది. ఇటీవలే ఒక బాబుకు కూడా జన్మనిచ్చిన ఆమె ఒలింపిక్ పతకం గెలిచే కెరీర్ ముగించాలని భావి స్తోంది. గతంలో 2016, 2021, 2024 ఒలింపిక్స్‌లో పోటీపడినా పతకాలు గెలవలేకపోయింది.