calender_icon.png 1 June, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుకాణాన్ని సీజ్ చేసిన అధికారులు

30-05-2025 08:42:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద నిర్వహిస్తున్న తెల్లకల్లు దుకాణంలో మైనర్లకు విక్రయాలు తెల్ల కళ్ళు పాకెట్లను అమ్మడంతో కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీ చేసి నిజమని తేలడంతో దుకాణాలను సీజ్ చేశారు. తెల్లకల్లు దుకాణాల్లో 10 సంవత్సరాలలోపు పిల్లలకు కల్లును విక్రయించడం వల్ల వారు చెడిపోతున్నారని కొందరు తల్లిదండ్రులు ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దుకాణాన్ని సందర్శించి శాఖ పరమైన చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.