25 May, 2026 | 12:09 AM

ఉత్సాహంగా రీజియన్ స్థాయి పోటీలు

17-06-2024 12:11 AM

మంచిర్యాల, జూన్16(విజయక్రాంతి): వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన రీజియన్ స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. క్లబ్ చైర్మన్ కాచం సతీష అధ్యక్షతన జరిగిన ఈ క్రీడలను మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వాసవీ క్లబ్ అంతర్జాతీయ ఆడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిరపురం రాజేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాతో పాటు ఆర్యవైశ్యులను ప్రోత్సహించేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. చెస్, క్యారమ్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో గెలుపొందిన వారికి ఆశోక్ సహకారంతో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు కటుకం హరీష్, అంతర్జాతీయ ప్రోగ్రం కో ఆర్టీనేటర్ దొంతుల ముఖేష్, కుంకుముట్టి వెంకటేష్, రీజియన్ చైర్మన్ సతీష్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.