సోన్‌లో ఊర్ల పండుగ
17-06-2024 12:10 AM
నిర్మల్, జూన్16(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం ఊర్ల పండుగను నిర్వహించారు. వానాకాలం ప్రారంభ కావడంతో ఖరీఫ్ సీజన్‌లో వానలు కురిసి పంటలు పండి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఏటా పండుగను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్రామదేవతలకు గంగాజలాలతో అభిషకం చేసి, గ్రామంలో వలలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రజలు గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకొన్నారు.






