వ్యవసాయ శాఖ పేరు మార్చాలి
17-06-2024 12:12 AM
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
హైదరాబాద్, జూన్ 16 ( విజయక్రాంతి) : రాష్ట్ర వ్యవసాయ శాఖ పేరును మార్చాలనిరాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి సూచించారు. వ్యవసాయ సంక్షేమ శాఖగా నామకరణం చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషి చేసే వ్యవసాయ శాఖ పేరులో సంక్షేమం అనే పదాన్ని చేర్చాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షేమ శాఖగానే పిలిచేవారని, 2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మార్చిందని పేర్కొన్నారు. కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ పేరునే కొనసాగిస్తున్నాయని ఉదహరించారు.






