కూకట్‌పల్లిలో ఎగ్జిబిషన్ కోలాహలం
22-05-2024 02:13 AM
ఆకట్టుకుంటున్న వివిధ ప్రదర్శనలు
కూకట్‌పల్లి, మే 21, విజయ క్రాంతి: కూకట్‌పల్లి మెట్రో ట్రక్ పార్క్‌లో కొనసాగుతున్న మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశంలోనే ప్రప్రథమంగా జలకన్యల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షగా నిలుస్తోందని నిర్వాహకుడు రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మహా నగరంలో ఇలాంటి ప్రదర్శనలు గతంలో ఎప్పుడు చేపట్టలేదని, ఇదే మొదటిసారి అని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 500 రకాల చేపలతో ప్రత్యేక అండర్ వాటర్ అక్వేరియం ఆహ్లాదం పంచుతోందని అన్నారు. 250 అడుగుల అండర్ వాటర్ టన్నెల్, స్కూబ డ్రైవింగ్ అలరిస్తున్నాయని చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ నడుస్తుందని తెలిపారు.






