23 August, 2026 | 11:05 AM

అంగన్వాడీ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలి

22-05-2024 02:14 AM

ఇబ్రహీంపట్నం, మే 21 (విజయక్రాంతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంచాల జెడ్పీటీసీ మర్రి నిత్యనిరంజన్‌రెడ్డి కోరారు.  మంగళవారం జరిగిన మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమె ఈ మేరకు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలు అంగన్‌వాడీ సెంటర్లలో టాయిలెట్స్ లేవని, విద్యుత్ సౌకర్యం లేదని, కొన్ని చోట్ల కిటికీలు, తలుపులు లేని పరిస్థితులు ఉన్నాయని, వెంటనే వాటిని  సమకూర్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని జెడ్పీటీసీ కోరారు.

స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికల విద్య, మైనర్ వివాహాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులకు సమయానుకూలంగా పౌష్టికాహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దుర్గాబయి దేశ్ ముఖ్ వారు అందించే టైలరింగ్, కంప్యూటర్ శిక్షణను సద్వినియోగపరచుకోవాలని మహిళలకు సూచించారు.  కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ రంగారావు, కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ దుర్గాబాయి దేశ్‌ముఖ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.