పేదింటి అమ్మాయి పెళ్లికి పుస్తె, మెట్టెలు కానుక
22-05-2024 02:12 AM
అబ్దుల్లాపూర్ మెట్, మే 21: అబ్దుల్లాపూర్‌మెట్ జెన్నారం కాలనీలో సురేఖ తన కుమారుడు లోకేశ్, కుమార్తె శ్రీవాణితో కలిసి జీవిస్తోంది. ఆమె భర్త చనిపోయిన కష్టపడుతూ కుటుంబాన్ని నడిపిస్తోంది. లోకేశ్ తలసేమియాతో బాధపడుతున్నాడు. అయి తే, ఈ నిరుపేద కుటుంబాన్ని సురక్ష సేవా సంఘం ఆదుకుంటూ వస్తోంది. లోకేశ్‌కు గతంలో రక్తం కోసం సహాయం అందించింది. తాజాగా సురేఖ కూతురు శ్రీవాణి పెళ్లికి పుస్తె, మెట్టెలు కానుకగా అందజేసి సుహృదయతను చాటుకుంది. కార్యక్రమంలో సురక్ష సేవా సంఘం రాష్త్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్, గౌరవ సలహాదారులు నాగవల్లి యాదగిరి, ఎక్జిక్యూటీవ్ సభ్యులు అచిని మహేష్, సంఘ సభ్యులు యాకుబ్, సోమేష్, చెంగన్న, ఆండాలమ్మ, శ్రీనివాస్, సాగర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






