పరిష్కారం చూపకపోతే ‘సత్యాగ్రహమే’
20-06-2024 01:18 AM
న్యూఢిల్లీ, జూన్ 19: ఢిల్లీలో నీటి ఎద్దడికి ఈనెల 21లోపు పరిష్కారం చూపాలని, లేదంటే ‘సత్యాగ్రహానికి’ దిగుతామని ఢిల్లీ మంత్రి అతిశీ బుధవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఎదు ర్కొంటున్న సవాళ్లను వివరించారు. ప్రజల అవసరాలకు ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నప్పటికీ అవసరాలు తీరడం లేదన్నారు. సుమారు 28 లక్షల మంది ప్రస్తుతం నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్నారు. నీటి ఎద్దడి తలెత్తడానికి ఎండలు కూడా ఒక కారణమన్నారు. ప్రతిరోజూ 1,050 ఎంజీడీ జలాలు అవసరమవుతాయన్నారు. హర్యానా నుంచి ఢిల్లీవాసుల అవసరాలకు 613 ఎంజీడీల జలాలు రావాల్సి ఉండగా, ప్రస్తుతం 513 ఎంజీడీల జలాలు మాత్రమే వస్తున్నాయన్నారు.






