14 August, 2026 | 11:20 PM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సాలూర చెక్‌పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలు

14-08-2026 09:27 PM

బోధన్,(విజయ క్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలూర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. సీఐ నార్త్ రూరల్ ఆధ్వర్యంలో బోధన్ రూరల్ పోలీస్ సిబ్బంది వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు తనిఖీల సమయంలో అవసరమైన పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని, పోలీసులకు సహకరించాలని సూచించారు. అలాగే అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.