14 August, 2026 | 10:15 PM

సాంకేతిక విద్యతోనే సువర్ణ భవిష్యత్తు

14-08-2026 09:25 PM

కోదాడలో ఉన్న హైదరాబాద్ గర్ల్స్ కాలేజీలో సందడిగా 'ఫ్రెషర్స్ డే వేడుకలు

కోదాడ,(విజయక్రాంతి): విద్యార్థినులు కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా సృజనాత్మక విద్యను అలవర్చుకోవాలని కోదాడలో ఉన్న హైదరాబాద్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ చైర్‌పర్సన్ పృథ్వి రమణ ఆకాంక్షించారు. శుక్రవారం పట్టణంలోని ఏఆర్ఏఆర్ ఫంక్షన్ హాల్‌నందు నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు క్రమశిక్షణ, శ్రద్ధతో చదువుకుని తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

నేటి సాంకేతిక యుగానికి అనుగుణంగా సాంకేతిక విద్యను నేర్చుకుని సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. గత ఏడాది ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వర్షిత, శర్మణిల తల్లిదండ్రులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ పుల్లూరి వెంకట నారాయణ, అకాడమిక్ ఇంచార్జ్ గోవర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ కన్నయ్య, క్యాంపస్ ఇంచార్జ్ రాయుడు, అధ్యాపకులు రవీందర్ నాయక్, వెంకన్న, మాణిక్యం, ఖాసీం,వెంకట్, వెంకట్ రెడ్డి, ఆంజనేయులు, దుర్గా ప్రసాద్, బడే సాబ్,రఘు, వల్లి,శాంత, బ్రాహ్మణి, జ్యోత్స్న, అనైన, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.