27 February, 2026 | 10:29 AM

శాఖలవారీగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి

27-02-2026 12:00 AM
  1. ‘వంద రోజుల’ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి
  2. సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): సీఎంతోపాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనే వంద రోజుల కార్యక్రమంలో అన్ని శాఖలవారీగా విస్తృ త కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేర కు రాష్ట్రంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై 100 రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడించా రు.

గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. స్పెషల్ సీఎస్‌లు జయేష్‌రంజన్, వికాస్‌రాజ్, సీవీ ఆనంద్, సంజయ్‌కుమార్, మహేష్ దత్ ఎక్కా, సబ్యసాచి ఘోష్, నవీన్ మిట్టల్, దాన కిషోర్, అహ్మద్ నదీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వంద రోజుల కార్యక్రమంపై ఈ నెల 28న నిర్వహించే కార్యదర్శుల సమావేశానికి సీఎం హాజరవుతారన్నారు.

మార్చి 1న కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడిం చారు. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు వివిధ అభివృద్ధి పనులపై ప్రతీ శాఖ తమ 100 రోజుల కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ల సమావేశంలో చర్చనీ యాంశాలు వెంటనే రూపొందించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎంతోపాటు మంత్రులు ప్రారంభిస్తారని, ఇందుకుఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ భవనా లను సిద్ధంచేయాలని సూచించారు.

ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, హెల్త్, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, వ్యవసాయం, రెవెన్యూ, పర్యాటక, పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమం, గృహనిర్మాణం, రెవెన్యూ, విద్యుత్, కార్మిక శాఖలు కార్యాచరణ రూపొందించాలన్నారు. పారిశు ధ్యం, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యపై నూతన ర్పంచులు, మున్సిపల్ చైర్మన్లకు అవగాహ న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సచివాలయంతోపాటు హెచ్‌ఓడీలలో ఈ-ఆఫీస్‌ను అమలుచేయాలని ఆదేశించారు.