15 June, 2026 | 11:08 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

సురక్షసేవా సంఘం ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు

11-11-2024 01:16 AM

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్10: సురక్ష సేవా సంఘం ఆధ్వర్యంలో 64 మంది కంటిచూపులేని నిరుపేద వృద్ధులకు ఆపరేషన్ ద్వారా కంటిచూపు ప్రసాదించారు. ఈ సందర్భం గా ఆదివారం సురక్ష సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపిశంకర్ యాదవ్ మాట్లాడుతూ.. సంఘం ఆధ్వర్యంలో మూడేండ్లుగా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నట్లు చెప్పా రు.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 268 మంది వృద్ధులకు చూపునిచ్చినట్లు తెలిపారు. సురక్ష సేవా సంఘం, శ్రీ ధనలక్ష్మిఆప్టికల్స్ సంయుక్తంగా అబ్దుల్లాపూర్‌మెట్, మాల్, మల్లేపల్లి, కడ్తా ల్, వరంగల్, జనగామ, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంకు చెందిన 64 మంది వృద్ధులకు విజయవంతం గా కంటి ఆపరేషన్లు చేయించి, క్షేమంగా వారి ఇండ్లకు పంపినట్లు చెప్పారు.