02-12-2025 08:11:09 PM
గాంధారి (విజయక్రాంతి): విద్యార్థులు కంటి సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ సూచించారు. గాంధారి మండల కేంద్రంలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో మంగళవారం రోజున విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలున్న విద్యార్థులకు అద్దాలు వాడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్, స్క్రీన్ వినియోగం తగ్గించి, విటమిన్లు ఉన్న పోషక పదార్థాలను ఆహారంలో తీసుకోవడం ద్వారా కంటి సమస్యలు రాకుండా నివారించవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.