02-12-2025 08:13:12 PM
సిద్దిపేట క్రైం: ఈ నెల 7న సాయంత్రం 4 గంటలకు సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో కవి మహమూద్ పాషా రచించిన “కలవార” కవిత్వ సంకలనం పుస్తకావిష్కరణ సభ నిర్వహిస్తామని తెలంగాణ రచయితల వేదిక ప్రతినిధులు తెలిపారు. ఈ సభలో కొత్త కవిత్వ ధోరణులు, సాహిత్య సృజన, సమకాలీన కవిత్వ ప్రవణతలు వంటి అంశాలపై చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. పుస్తకావిష్కరణకు సంబంధించిన కరపత్రాన్ని మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెరవే రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్కపెల్లి యాదగిరి, జిల్లా అధ్యక్షుడు మహమూద్ పాషా, ప్రధాన కార్యదర్శి స్రవంతి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.