02-12-2025 08:08:42 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో యాదవుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మల్లన్న స్వామి ఆలయం ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఎల్లమ్మ తల్లికి బోనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనమెత్తుకొని ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్ల మధ్య పోతరాజులు నృత్యాలు చేయగా, కొందరు మహిళలు పూనకాలతో తూగారు. అనంతరం ఎల్లమ్మకు బోనాలు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.