calender_icon.png 21 January, 2026 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీకృపా ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అధ్యాపకురాలికి డాక్టరేట్ గౌరవం

21-01-2026 06:39:50 PM

సిద్దిపేట రూరల్: శ్రీకృపా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న సిద్దిపేటకు చెందిన బి. నాగరాణి డాక్టరేట్ పట్టా సాధించారు. గీతం విశ్వవిద్యాలయం నుండి ఆమె పీహెచ్‌డీ పూర్తిచేశారు. గీతం యూనివర్సిటీకి చెందిన డా. జి.వి. రాధా మార్గదర్శకత్వంలో ఆమె పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్.వై. మంజునాథ్, యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు డా. బి. నాగరాణిని అభినందించారు. ఆమె సాధించిన ఈ ఘనతతో సంస్థ ప్రతిష్ట మరింత పెరిగిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని పరిశోధనలు చేసి ఫార్మా స్యూటికల్ విద్యా రంగానికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు