calender_icon.png 21 January, 2026 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులుల లెక్కింపులో విషాదం

21-01-2026 06:31:21 PM

దుర్వాసన బేస్ క్యాంపులో విధులు 

బుధవారం ఉదయం లెక్కింపుకు వెళ్లి తిరిగి వస్తుండగా కుప్పకూలిన టైగర్ ట్రాకర్ 

అడవి నుండి అచ్చంపేట ఆసుపత్రికి తరలి

గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు నిర్ధారణ

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా వన్యప్రాణుల లెక్కింపు కొనసాగుతుంది. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు(32) మన్నానూర్ రేంజ్ పరిధిలోని దుర్వాసుల బేస్ క్యాంపు వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. వన్యప్రాణుల లెక్కింపులో భాగంగా బుధవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు విధులు నిర్వహిస్తూ తిరిగి వస్తుండగా నడుస్తున్న క్రమంలోనే కుప్పకూలిపోయాడని తెలిపారు.

ఈ క్రమంలో వెంటనే అటవీ శాఖ వాహనంలో దాసరి శ్రీనివాసులను హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరిశీలించిన వైద్యులు గుండెపోటు రావడంతోనే అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. ఉన్నట్టుండి కుటుంబ యజమాని మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోజున మిందంటాయి. బాధిత కుటుంబాన్ని అడవి శాఖ అధికారులు అన్ని విధాల ఆదుకొని కుటుంబానికి బాసటగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు.