calender_icon.png 3 February, 2026 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ వైద్యుడు అరెస్ట్

03-02-2026 07:25:48 PM

ఉప్పల్,(విజయక్రాంతి): సరైన వైద్యా అర్హత లేకుండానే ఫస్ట్ ఎయిడ్ పేరుతో  క్లినిక్ నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యతో చెలగాటమాడుతున్న  ఓ నకిలీ వైద్యుని అరెస్ట్ చేసిన సంఘటన  నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాచారం సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం... గుంటూరు జిల్లాకు చెందిన వెంకటకృష్ణ బీఎస్సీ నర్సింగ్ చదువును ఆర్థిక ఇబ్బంది కారణంగా చదువు మధ్యలో వదిలేసి మాచర్లలో ఓ రిటైర్డ్  డాక్టర్ వద్ద  కాంపౌండర్ గా పని చేశాడు.

దీంతో వైద్య పరిజ్ఞానం ఉండడంతో మల్లాపూర్ భవాని నగర్ లోని  ఫస్ట్ ఎయిడ్ క్లీనిక్ పేరుతో ఆసుపత్రిని ప్రారంభించాడు. ఇలాంటి అనుమతులు లేకుండా వైద్యని నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు నాచారం పోలీసులు ఆసుపత్రి పై దాడులు నిర్వహించారు.  నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం పేరిట ప్రజల   ప్రాణాలతో  చెలగాటమాడుతున్న   వెంకటకృష్ణను ఆదుపులో తీసుకున్న పోలీసులు   కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.