03-02-2026 07:15:17 PM
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ
మోతె,(విజయక్రాంతి): కర్ల రాజేష్ మృతికి కారణమైన దోషులను కాపాడితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల రెండు నియోజకవర్గాల అడ్రస్ గల్లంతు కాక తప్పదని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగా అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కర్ల రాజేష్ సంతాప సభలో మాట్లాడుతూ, అమాయకుడైన కర్ల రాజేష్ ఎలాంటి తప్పు చేయకుండా అక్రమ నిర్భంధం, చేసి కేసులు నమోదు చేసి పోలీసులు చిత్ర హింసలకు, గురి చేసి లాకప్ డెత్ కి కారణమైన యస్ ఐ సురేష్ రెడ్డి, ని కాపాడటం వెనుక ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఉన్నదని చెప్పారు. రాజేష్ చనిపోయి సుమారు మూడు నెలలు గడుస్తున్నప్పటికి, ఎందుకు నోరు మేదపడం లేదని మండి పడ్డారు. ఆధారాలు లేకుండా పిర్యాదు, చేయకుండా అక్రమ నిర్భంధంతో రాజేష్ మృతికి పోలీసులు భాద్యత, వహించాల్సి వస్తుందని చాల జగ్రత్తగా పోస్టు మార్టం రిపోర్ట్, ను సైతం తమ కు అనుకూలంగా మలుచుకునే విధంగా కేసును తప్పుదోవ పట్టించే విధంగా, రాష్ట్ర మంత్రి, కోదాడ ఎమ్మెల్యే సహకారంతో ఈ తంతు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని రి పోస్ట్ మార్టన్ చేయాలని డిమాండ్ చేశారు. రాజేష్ మృతి ఏ రాజకీయ పార్టీలకు పట్టడం లేదని, కేవలం మాదిగల ఓట్లు మాత్రమే కావలి మాదిగలు జెండాలు పట్టాలి జై కొట్టాలా అని ఏద్దేవా చేశారు. జాతి కోసం ఎక్కడి దాకా నైనా కొట్లడతాం కానీ ఆత్మ గౌరవం తాకట్టు పెట్టేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో సి పి యం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పల్లి సైదులు, బి జె పి మండల అధ్యక్షులు శంకర్ నాయక్, బి ఆర్ యస్ మండల అధ్యక్షులు శీలం సైదులు, యం జె యఫ్ జిల్లా అధికార ప్రతినిధి పల్లెల లక్ష్మణ్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రామాంజి, మండల అధ్యక్షులు విజయ్, సునీల్, టీ ఆర్ పి సాయి, గ్రామ సర్పంచ్ దోసపాటి అనురాధ, తదితరులు పాల్గొన్నారు.