23 April, 2026 | 2:20 PM

Breaking News

సచివాలయంలో నకిలీ ఎమ్మార్వో..!

06-02-2025 11:43 PM

ఫేక్ ఐడీ కార్డుతో లోనికి వెళ్లేందుకు యత్నం...

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): రాష్ట్ర సచివాలయంలోకి గురువారం ఒక నకిలీ ఎమ్మార్వో వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... అంజయ్య అనే వ్యక్తి తిప్పర్తి ఎమ్మార్వో అని చెప్పి నకిలీ ఐడీ కార్డు, కారుతో నేరుగా సచివాలయంలోకి వెళ్లేందుకు యత్నించాడు. అయితే వివరాలు సరిగ్గా లేకపోవడంతో సచివాలయం భద్రతా సిబ్బందికి అనుమానమొచ్చింది. దీంతో తిప్పర్తి ఎమ్మార్వో కార్యాలయానికి ఫోన్ చేసి వివరాలు ఆరా తీయగా అంజయ్య నకిలీ అని తేలింది. ఎస్‌టీఎఫ్ ఎస్సై ఫిర్యాదు మేరకు అంజయ్యను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అంజయ్య వచ్చిన కారుపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని స్టిక్కర్ అతికించి ఉండడం గమనార్హం. కాగా అంజయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.